కలయికకు దూరం కావడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి అనే విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.
శృంగారానికి ఎక్కువ కాలం దూరం కావడం వల్ల... అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అవేంటో ఓసారి చూద్దాం...
1. కోరికలు తగ్గిపోతాయి...
దాదాపు 174 మంది పై చేసిన సర్వేలో ఈ విషయం నిరూపితమైందట. ఎక్కువ కాలం గ్యాప్ రావడం వల్ల... దాని మీద ఆసక్తి కూడా తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
2. బలహీన రోగనిరోధక వ్యవస్థ
ఎండార్ఫిన్‌లను ఉత్పత్తి చేయడం ద్వారా..రెగ్యులర్ సెక్స్ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. వ్యాధితో పోరాడటానికి శరీరాన్ని సిద్ధం చేస్తుంది.
ఒక అధ్యయనం ప్రకారం, రెగ్యులర్ సంభోగంలో పాల్గొనేవారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్లు తేలడం విశేషం.
3. ఒత్తిడి మరియు రక్తపోటు స్థాయిలలో పెరుగుదల
మీరు సెక్స్ చేయకుండా.. వేరే విధంగా వ్యాయామం చేయకుంటే మీ రక్తపోటు, ఒత్తిడి స్థాయిలు పెరగవచ్చు. ఇది మీ మానసిక స్థితిని తగ్గిస్తుంది. ఒత్తిడి పెరిగిపోయి... ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఈ ఆర్టికల్ వల్ల శృంగారానికి దూరం అయితే... కలిగే నష్టాలు తెలిశాయి.