News

Bank And Adhaar Link: బ్యాంకు అకౌంటుతో ఆధార్ కార్డు లింక్ చేశారా..? చేస్తే లాభాలు ఇవే..

బ్యాంకు అకౌంటుతో ఆధార్ కార్డు లింక్ చేశారా..? చేస్తే లాభాలు ఇవే..
మీ ఆధార్ కార్డుని బ్యాంక్ అకౌంటుతో  ఇంకా లింక్ చేయలేదా ? చేయని వారు కచ్చితంగా దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి.
మీ బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ కార్డ్‌ని లింక్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో  తెలుసా…
ITR ఫైలింగ్:
ఆదాయపు పన్ను రిటర్నులు లేదా ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు కూడా ఆధార్ చాల కీలకమైనది.
పన్నుల చెల్లింపుకు అవసరమైన ప్రైమరీ  డాక్యుమెంట్ అయిన పాన్ కార్డ్….
తాజా ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలి. అలాగే ఆధార్ కార్డ్‌ పరోక్షంగా కూడా ఎంతో అవసరం.
ట్రాన్స్ఫర్ బెనిఫిట్స్:
ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలన్నీ కేవలం ఆధార్‌ ఆధారంగానే అందజేస్తారు.
గ్రామీణ ప్రాంతాల్లో, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ నిధులు, వేతనాలు కూడా ఆధార్ కార్డుల సహాయంతో అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే పంపిణీ చేస్తారు.
ఆర్థిక మోసాలకు వ్యతిరేకంగా చర్యలు:
ఈ గుర్తింపు డాక్యుమెంట్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఆర్థిక మోసాలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
నకిలీ ఇన్‌వాయిస్‌లను నిరోధించేందుకు జీఎస్టీ కౌన్సిల్ దేశవ్యాప్తంగా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అథెంటికేషన్  ప్రవేశపెట్టింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button