జగన్ మోహన్ రెడ్డి పాలన పై కీరవాణి సెటైర్లు...!
గురువారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ జరిగింది ఇది అందరికీ తెలిసిందే...
ఈ సందర్బంగా కీరవాణి మాట్లాడుతూ
"బతికితే రామోజీరావులా బతకాలని" ఓ సభలో అన్నాను.
మరణించినా ఆయనలానే మరణించాలి అని ఇప్పుడు అంటున్నాను అన్నారు.
ఎందుకంటే.. కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు..
తన మరణాన్ని... తన మృత్యువునీ ఆపి ఉత్తరాయణం వచ్చేంత వరకూ వాయిదా వేశారు.
అదే విధంగా తాను ఎంతో ప్రేమించే ఆంధ్ర ప్రదేశ్ ను కబంద హస్తాల్లోంచి బయటపడడం ఆయన కళ్లారా చూసి....
అప్పుడు నిష్క్రమించారు.
అందుకే "మరణించినా ఆయనలా మరణించాలి" అంటూ పరోక్షంగా Ysrcp సర్కారుపై తన నిరసన వ్యక్తం చేశారు.
ఈ సభకు ప్రముఖ దర్శకులు రాఘవేంద్ర రావు, రాజమౌళి, నిర్మాతలు అశ్విని దత్, సురేశ్ బాబు, శ్యాంప్రసాద్ రెడ్డి, ప్రముఖ నటి జయసుధ, సంగీత దర్శకుడు ఎం ఏం కీరవాణితోపాటు టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు భారీగా హాజరయ్యారు.