భార్య భర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలో తెలుసా...?
కొందరు 10 Years గ్యాప్ తో పెళ్లి చేసుకునేవారు ఉన్నారు. మరి కొందరు.. Same Age ఉన్నవాళ్లు కూడా పెళ్లి చేసుకుంటూ ఉంటారు.
అసలు... Age Gap ఎంత ఉండాలి..?
దీని గురించి చాణక్యుడు ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం...
భార్యాభర్తల బంధం అత్యంత పవిత్రమైనదని, ఈ బంధాన్ని కొనసాగించాలంటే భార్యాభర్తలు ఒకరి అవసరాలను ఒకరు గుర్తించాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.
భార్యాభర్తల మధ్య వయోభేదం ఎక్కువగా ఉంటే.. అలాంటి జీవితం విషమంగా మారుతుంది.
వైవాహిక జీవితం ఎక్కువ కాలం సాగదు. భార్యాభర్తల మధ్య వయసు వ్యత్యాసం ఎక్కువగా ఉండకూడదు.
ఆచార్య చాణక్యుడు ప్రకారం, భార్యాభర్తల మధ్య సంబంధాలు శారీరక , మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.
ఇద్దరి మధ్య వయసులో భారీ వ్యత్యాసం ఉండటంతో వైవాహిక జీవితాన్ని సర్దుబాటు చేసుకోవడంలో సమస్యలు తలెత్తుతున్నాయి.
భార్య లేదా భర్త తమ జీవిత భాగస్వామి అవసరాలను తీర్చకపోతే, జీవితంలో ఆనందం ఉండదు.
భార్యాభర్తల మధ్య ప్రేమ, సామరస్యం ఎప్పుడూ ఒకేలా ఉండాలని చాణక్యుడు చెప్పాడు.
అందుకే అవన్నీ అర్థం చేసుకోవాలంటే.. భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎక్కువగా ఉండకూడదు.
ఒకే వయస్సులో ఉన్నవారు దాదాపు ఒకే మనస్తత్వం కలిగి ఉంటారు.
ఎందుకంటే.. చిన్నప్పటి నుంచి ఒకే సమాజాన్ని, అవే మార్పులను చూస్తున్నారు.
ఇప్పుడు మీ తల్లిదండ్రుల ఆలోచనా విధానానికి, మీ మనస్తత్వానికి చాలా తేడా ఉంది.
అందుకే 3-5 ఏళ్లు గ్యాప్ ఉంటేనే వైవాహిక జీవితం బాగుంటుంది.