TDP STATE PRESIDENT: టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు..
TDP ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా నియమితులైన పల్లా శ్రీనివాసరావు యాదవ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన...
తన నియామకంపై పార్టీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
TDP అంటే బీసీలు.. బీసీలంటే TDP అని మరోసారి చంద్రబాబు రుజువు చేశారని కొనియాడారు.
టీడీపీకి వెన్నెముకగా ఉండే బీసీలకు పెద్ద పీట వేస్తూ... రాష్ట్ర అధ్యక్ష పదవీ బాధ్యతలు అప్పగించడంపై హర్షం వ్యక్తం చేశారు.