దేశంలో కొత్త టెలీ కమ్యూనికేషన్ చట్టం-2023 అమలులోకి వచ్చింది. నేటి (26-6-2024) నుంచి కొత్త టెలికం చట్టంలోని నిబంధనలు దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చాయి.
కొత్త చట్టం ప్రకారం...
9 సిమ్ కార్డులు ఒక వ్యక్తి పేరుపై గరిష్టంగా రిజిస్టర్ చేసుకొని ఉండవచ్చు.
అయితే కేవలం 6 సిమ్ కార్డులు మాత్రమే జమ్మూ, కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు కలిగి ఉండే అవకాశం ఉంది.
ఈ పరిమితికి మించి సిమ్ కార్డులు కలిగి ఉంటే..
తొలిసారి రూ.50వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
రెండోసారి కూడా నిబంధన ఉల్లంఘించి పరిమితికి మించి సిమ్ కార్డులు ఉంటే.. రూ.2లక్షల వరకు ఫైన్ చెల్లించాల్సిన ఉంటుంది.
కొత్త చట్టం ప్రకారం.. ఎవరైనా ఇతరులను మోసగించి, తప్పుడు గుర్తింపు పత్రాలను ఉపయోగించి సిమ్ కార్డును పొందినట్లయితే చర్యలు తప్పవు.
తప్పుడు ధ్రువపత్రాలతో సిమ్ కార్డు పొందినట్లు తేలితే గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల రూపాయల జరిమానా విధిస్తారు. లేదా రెండూ విధించవచ్చు.
అలాగే వినియోగదారు సమ్మతి లేకుండా వాణిజ్య సందేశాలు పంపిస్తే.. సంబంధిత ఆపరేటర్‌కు రూ.2 లక్షల వరకు భారీ జరిమానా ఉంటుంది.
అలాగే, భవిష్యత్తులో ఎలాంటి సేవలు అందించకుండా నిషేధానికి గురయ్యే అవకాశం కూడా ఉంది.