లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ
లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకున్నట్లు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మంగళవారం ప్రకటించారు.
ఈ మేరకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్‌కు లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు.
లోక్‌సభ స్పీకర్ ఎన్నికకు ఒకరోజు ముందుగా ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకున్నారు.