28-6-2024 నా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న పల్లా శ్రీనివాసరావు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు..
ఆయన మాట్లాడుతూ
గత ప్రభుత్వం అధికారాన్ని అపహాస్యం చేస్తూ... ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టింది అన్నారు.
కేవలం ప్రతిపక్ష నేతలను అణగదొక్కడానికే అధికారాన్ని వినియోగించారు.
రాజకీయ ప్రేరేపిత కేసులను మూడు నెలల్లో తీయించేస్తాం అన్నారు.
FIR నమోదై.. కోర్టులో ఉన్న రాజకీయ ప్రేరేపిత కేసులను ఒక ఏడాది లో తొలగించేందుకు కృషి చేస్తాం అన్నారు.
ఎవరిపై ఎన్ని కేసులున్నాయో కార్యకర్తలు, నాయకులు పార్టీ దృష్టికి తీసుకురావాలి అని పల్లా శ్రీనివాసరావు కోరారు.