Mp Bala Showry Talks About Pawan Kalyan: పార్లమెంటులో పవన్ కల్యాణ్ పోరాటాన్ని ప్రస్తావించిన ఎంపీ బాలశౌరి.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ను ఆ పార్టీ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పొగడ్తలతో ముంచెత్తారు.

లోక్సభలో ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు అభినందనలు తెలియజేశారు. 

తరువాత ఈ ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన పోరాటం, పోటీ చేసిన ప్రతి స్థానంలో అభ్యర్థులు ఏ విధంగా గెలిచారన్న అంశాలను వివరించారు.

రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు నెరవేర్చడానికి NDA కూటమి ఏర్పాటు కోసం పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయాలు మరియు ఆయన చేసిన త్యాగం గురించి సభలో ప్రస్తావించారు.

దేశంలో NDA కూటమి గెలుపొందిన తర్వాత తొలిసారి పార్లమెంట్ CENTRAL HALL లో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తేశారు.

పవన్ అంటే కేవలం పవన్ కాదని.. పవన్ అంటే ఆందీ(తుఫాన్) అని ప్రశంసించారు. ఇక ప్రధాని మోదీ మాట్లాడిన వ్యాఖ్యలను పార్లమెంటులో ప్రస్తావించారు ఎంపీ బాలశౌరి.

పవన్ నిజంగానే ఏపీ రాజకీయాల్లో తుఫాన్ సృష్టించారన్నారు. అలాగే ప్రత్యర్థులను మట్టి కరిపించారని కొనియాడారు. 

భారత దేశంలో మరే పార్టీ సాధించని ఘన విజయం తమ పార్టీ జనసేన సాధించిందని అన్నారు.

140 కోట్ల మంది ప్రజలు ఉన్న మన దేశంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. 

ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో గెలిచి 100 శాతం STRIKE RATE సాధించిన పార్టీ జనసేన మాత్రమేనని ఆయన తెలిపారు.

ఇలాంటి ఘనత సాధించడం దేశ చరిత్రలోనే ప్రథమమని ఎంపీ బాలశౌరి స్పష్టం చేశారు.