Hyderabad: గేటెడ్ కమ్యూనిటీల నిర్వహణలో సరికొత్త రికార్డు..!


మియాపూర్లోని SMR VINAY సిటీ హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీల నిర్వహణలో సరికొత్త చరిత్ర సృష్టించింది.

గత 4 సంవత్సరాలలో నయా పైసా Maintenance పెంచకుండా.. కమ్యూనిటీని సమర్థంగా నిర్వహిస్తోంది. 

ఒకవైపు 4 సంవత్సరాల నుంచి సిబ్బందికి ఏటా పది శాతం జీతాల్ని పెంచుతూ.. మరోవైపు అభివృద్ధి పనుల్ని సైతం అదే స్థాయిలో చేపట్టింది.

గత 4 సంవత్సరాలలో సుమారు 70 కి పైగా సీసీ టీవీలను పెంచి.. నివాసితులకు భద్రతకు పెద్దపీట వేసింది.

ఏటా సుమారు 80 రోజుల్లో Festivals...వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్ని సమర్థవంతంగా నిర్వహించింది.

నివాసితులు ప్రతినెలా చెల్లించే నెలసరి నిర్వహణ సొమ్ము మీదే ఆధారపడకుండా.. ఇతర ఆదాయ మార్గాల్ని గణనీయంగా పెంచింది.

నివాసితులు ఎదుర్కొనే సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు బ్లాకుల వారీగా ప్రత్యేక వాట్సప్ గ్రూపులను 2020 లోనే ఏర్పాటు చేసింది.

మొత్తానికి, గేటెడ్ కమ్యూనిటీల నిర్వహణను ఎలా చేయాలనే విషయాన్ని చేసి చూపెట్టింది.

ఈ సందర్భంగా SMR VINAY CITY ప్రధాన కార్యదర్శి గోరంట్ల ప్రసాద్ మాట్లాడుతూ.. 

రెసిడెంట్స్ సలహా సూచనలు, కమిటీ సభ్యుల సహకారంతోనే ఇదంతా సాధ్యమైందన్నారు.