దేశంలో ఖరీదైన రియల్ ఎస్టేట్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ముంబైలో....
ఎప్పటికప్పుడు ఖరీదైన కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి.
ఒక్కో ఫ్లాటు రూ.వందల కోట్లు వెచ్చించి కొనడం కొత్త ఏమి కాదు..
తాజాగా గోద్రేజ్ అగ్రోవెట్ చైర్మన్ నాదిర్ గోద్రేజ్
ముంబై మలబార్ హిల్ లో మూడు అపార్ట్ మెంట్లను రూ.180 కోట్లకు కొనుగోలు చేశారు.
ఒక్కో ఫ్లాట్ 4,610 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాలో ఉన్నాయి అని తెలుస్తుంది.
మొత్తం 13,831 చదరపు అడుగుల విస్తీర్ణయంలో ఉన్న మూడు ఫ్లాట్లను చదరపు అడుగుకు రూ.1.3 లక్షల చొప్పున కొనుగోలు చేశారు.
ఆరు, ఏడు, ఎనిమిదో అంతస్తుల్లో ఉన్న ఈ ఫ్లాట్లను JSW REALITY NUNDI నేరుగా కొన్నారు.
జూన్ 12న సేల్ డీడ్ జరిగింది. ఒక్కో అపార్ట్ మెంట్ కు రూ.3.5 కోట్ల స్టాంపు డ్యూటీ చెల్లించారు అంటా.
దేశంలోని సంపన్న పారిశ్రామికవేత్తలు నివసించే మలబార్ హిల్ ముంబైలోని ఖరీదైన ప్రాంతాల్లో ఒకటి.
ఇక్కడ అపార్ట్ మెంట్లు చాలా కాస్ట్ ఎక్కువ. గతేడాది పరమ్ క్యాపిటల్ డైరెక్టర్ ముకుల్ అగర్వాల్ ముంబైలోని లోధా మలబార్ లో మూడు అపార్ట్ మెంట్లను రూ.263 కోట్లకు కొనుగోలు చేశారు.