Relationship
Break Up Effects: బ్రేకప్ తరువాత వచ్చే ఎఫెక్ట్స్.. అబ్బాయిలపై ఎలా ప్రభావం…!


బ్రేకప్ తరువాత వచ్చే ఎఫెక్ట్స్.. అబ్బాయిలపై ఎలా ప్రభావం…!
సాధారణంగా ఒక Relation Break అయితే ఆ అమ్మాయి ఎంత బాధ పడుతుందో అబ్బాయి కూడా అంతగానే బాధపడతాడు.
కాకపోతే అమ్మాయి బహిరంగంగా తన Pain ని Express చేస్తుంది.
అబ్బాయి అంత త్వరగా అందరి ముందు తన Pain ని Express చేయలేడు.
తన బాధని బయట పెట్టుకోవడం ద్వారా ఒక అమ్మాయి ఆ Pain నుండి బయటపడుతుంది.
కానీ అబ్బాయి తన బాధని బయటికి చెప్పుకోకపోవటం వలన ఆ Pain చాలా కాలం వరకు అనుభవిస్తూనే ఉంటాడు.
సాధారణంగా బ్రేకప్ తర్వాత స్త్రీలు భావోద్వేగాలని వెంటనే అనుభవిస్తారు.
కానీ పురుషులు భావోద్వేగాలని అంత త్వరగా బయట పెట్టలేరు.
ఇది చాలా ప్రతికూల పరిస్థితులకి దారితీస్తుంది. అవసరమైతే వైద్య ప్రక్రియకు కూడా కారణం అవుతుంది.
విడిపోయిన తర్వాత పురుషులు ఒక చిన్న సపోర్టు నెట్వర్క్ కారణంగా ఒంటరితనాన్ని అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అలాగే పురుషులు పరిస్థితిని అంగీకరించడానికి, మూసివేతను కోరుకోకుండా….
బంధాన్ని ముందుకు సాగించటానికి ఎక్కువగా మొగ్గుచూపుతారు.
స్త్రీలు తమ యొక్క బాధని చుట్టూ ఉన్న వాళ్ళతో పంచుకోవడంతో తమ బాధని తీర్చుకుంటారు కానీ పురుషులు అలా చేయలేరు.
పురుషులు ఎక్కువగా స్వయం విశ్వాసంపై ఆధారపడతారు. తమ భావోద్వేగాలను ఇతరులకు తెలియజేయడం సవాలుగా భావిస్తారు.
చివరిగా చెప్పేదేమిటంటే Break Up వల్ల స్త్రీ, పురుషులు ఇద్దరూ ఒకటే బాధ అనుభవిస్తారు….
కాకపోతే స్త్రీ బయటపడుతుంది పురుషుడు బయటపడడు.