News

Lok Sabha Speaker Election Result: లోక్ సభ స్పీకర్ ఇయనే.

Lok Sabha Speaker Election Result:
ఏకగ్రీవ సాంప్రదాయానికి తెరపడి 50 ఏళ్ల తర్వాత జరిగిన లోక్ సభ స్పీకర్ ఎన్నికలు.
లోక్ సభ స్పీకర్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది.
ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థి సురేష్…
మళ్ళీ మాజీ స్పీకర్ ఓం బిర్లాకే…
లోక్ సభ స్పీకర్ పదవి అధికార పార్టీకే దక్కడం ఆనవాయితీగా వచ్చింది. అధికార పార్టీకి సంఖ్యా బలం వుంటుంది కాబట్టి ప్రతిపక్షాలు పోటీలో నిలిచేవి కాదు.
కాబట్టి స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతుండేది… ఇది కొన్ని సంవత్సరాల నుండి లోక్ సభ సాంప్రదాయంగా మారిపోయింది.
ఎప్పటిలాగే స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు NDA ప్రభుత్వం ప్రయత్నించింది.
కానీ ఇండియా కూటమి పోటీకే మొగ్గుచూపింది… ఇండియా కూటమి తరపున తమ అభ్యర్థిని బరిలోకి దింపింది.
దీంతో అర్ధశతాబ్దం తర్వాత లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నికలు జరిగాయి.
ఇక కేరళ ఎంపీ సురేష్ తరపున INDIA కూటమి నాయకులు నామినేషన్ దాఖలు చేసారు.
మంగళవారం ఓం బిర్లాను స్పీకర్ గా ప్రతిపాదిస్తూ NDA మిత్రపక్ష పార్టీల నాయకులు నామినేషన్ దాఖలుచేసారు.
ఇరు పార్టీలు అభ్యర్థులను నిలబెట్టారు..దీంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి.
దీంతో ఈ రోజు (26-06-2024) సీక్రెట్ బ్యాలట్ ద్వారా ఎన్నిక జరిగింది… లోక్ సభ ఎంపీలంతా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
అయితే సభలో  NDA కే మెజారిటీ వుండటంతో 50 శాతానికి పైగా ఓట్లతో ఓంబిర్లా విజయం సాధించారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button